అరెస్టు ఐతే “అధికారమే”..!
ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాటితో పాటు ప్రజల ఆలోచనల్లోనూ విప్లవాత్మక చైతన్యం కనిపిస్తోంది. గతంలో మాదిరిగా కాకుండా అధికార పక్షం, విపక్షం పనితీరును పూసగుచ్చినట్టు పరిశీలిస్తున్నారు. మనదేశం లోనే కాదు అగ్రరాజ్యం అమెరికా ప్రజలు సైతం రాజకీయాలను, వాటి నాయకుల పోకడలను క్షుణ్ణంగా గమనిస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ వ్యవహారాలు, దాని నాయకులు ఎత్తుగడలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారంలో ఉన్నవారు అనాలోచితంగా తోక జాడిస్తే అదును చూసుకొని…