పిల్లర్లు కుంగడమా…!
అధికారులకే అంతుపట్టని కారణంతో ఆశ్చర్యంగా కుంగిపోయిన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని కేంద్ర బృందం పరిశీలించింది. రెండు రోజుల కిందట కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీ 20వ పిల్లర్ వద్ద కుంగిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని ఈ కమిటీ బ్యారేజీని పరిశీలించింది.19, 20, 21వ పిల్లర్ల వద్ద పగుళ్లకు గల కారణాలను అన్వేషించింది….