
కదులుతున్న బిజెపి “పావు”..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ “సనాతన ధర్మ పరిరక్షణ” పర్యటనకు ముహూర్తం ఖరారైంది. ఆయన ఈ నెల 12వ తేది నుంచి కేరళ, తమిళనాడులో సనాతన ధర్మ బాట పట్టనున్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో నాలుగు రోజులు పాటు వివిధ దేవాలయాలను సందర్శిస్తారు. మొదట కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయానికి వెళ్తారు. అక్కడి నుంచి తమిళనాడు లోని మధుర మీనాక్షి, శ్రీపరుశరామస్వామి, అగస్థ్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై…