ఖతర్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఖతర్ లుసైల్ ప్యాలెస్‌లో నిర్వహించిన విందులో ట్రంప్‌తో పాటు ఖతర్ షేక్ ఎమిర్ తమిమ్ బిన్ హమీద్‌తోనూ ముచ్చటించారు. ఈ సందర్భంగా ట్రంప్‌తో పలు అంశాలపై అంబానీ కాసేపు చర్చించారు. రిలయన్స్ చీఫ్ అమెరికా వాణిజ్య కార్యదర్శి స్టీవ్ లుట్నిక్‌తో అంబానీ స్నేహపూర్వకంగా సంభాషించడం విశేషం. అమెరికా అధ్యక్షుడి గౌరవార్థం ఖతర్ సర్కార్ ఏర్పాటు చేసిన ఈ అధికారిక విందులో టెస్లా అధినేత మస్క్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడిగా జనవరి నెలలో రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ట్రంప్‌తో అంబానీ ఇది రెండవ సమావేశం. జనవరిలో ట్రంప్ రెండవ ప్రమాణ స్వీకారానికి ఒక రోజు ముందు అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ ట్రంప్‌ను కలిశారు.
ట్రంప్ తో అంబానీ…
