లోపల జాగ్రత్త…

pavn pc

సరిహద్దుల్లో సైనికులు ఎంత భద్రంగా దేశాన్ని రక్షిస్తున్నారో,  దేశం లోపల అంతర్గత భద్రతలో పోలీసు శాఖ కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండటం కీలకమనీ,  దీనిపై రాష్ట్ర పోలీసులను, పరిపాలన సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, దక్షిణాది రాష్ట్రాలు ఉగ్రవాదుల సున్నితమైన లక్ష్యం అఅనే విషయం గతంలో జరిగిన కిరాతక దాడుల్లో తేలిపోయిందన్నారు. కోయంబత్తూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడులు తల్చుకుంటే ఇప్పటికీ గుండె తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో భద్రతా సిబ్బంది ఎంత అప్రమత్తంగా ఉంటారో, రాష్ట్ర పోలీసులు కూడా అంతర్గత భద్రతపై అంతే దృష్టి సారించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *