ఇక పొడిగించం…
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు కోర్టు మరోసారి వాయిదా వేసింది. ప్రభుత్వ అదనపు ఏ.జీ. హాజరు కాలేకపోతున్నట్టు, మరింత సమయం కావాలని సీఐడీ ప్రత్యేక పీ.పీ. వివేకానంద కోర్టును కోరారు. అంతేకాక విచారణను ఈనెల 22కు వాయిదా వేయాలని వివేకానంద హైకోర్టును అభ్యర్ధించారు. పి. పి. అభ్యర్ధనను కోర్టు అంగీకరించక పోగా, మరోసారి గడువు పొడిగించేది లేదని తేల్చి చెప్పింది.తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా తెలిపింది.