రైతులపై”కర్ణా”అస్త్రం..
కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ)కి చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్‌తో ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చిన పంజాబ్ రైతులపై పోలీసులు ‘సోనిక్ ఆయుధాల’ను ప్రయోగించారు. ఒకే దిశలో కర్ణభేరీలు పగిలేలా శబ్దాలను విడుదల చేయడం సోనిక్ ఆయుధాల ప్రత్యేకత. లాంగ్ రేంజ్ అకూస్టిక్ డివైజ్(ఎల్ఆర్ఏడీ)గా పిలిచే సోనిక్ ఆయుధాలను సాధారణంగా సముద్రపు దొంగలకు హెచ్చరికలు జారీ చేయడానికి వినియోగిస్తుంటారు. కొన్ని దేశాల్లో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు వాడుతున్నారు. అమెరికా సైన్యం అమ్ముల పొదిలో 2000 సంవత్సరం నుంచే సోనిక్ ఆయుధాలుండగా 2013లో ఢిల్లీ…