తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగకు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 17 తేదీ సోమవారం సెలవుగా నిర్నిణయించారు. ఆ రోజును సాధారణ సెలవుల’కింద జాబితాలో చేర్చారు. హిందూ క్యాలెండర్ ప్రకారం మహంకాళి దేవిని జరుపుకునే ‘ఆషాడ’ మాసంతో బోనాలు మొదలవుతాయి. భక్తులు, ముఖ్యంగా మహిళలు ప్రత్యేకంగా అలంకరించిన కుండలలో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ప్రతి ఏటా హైదరాబాద్‌లో నెలరోజుల పాటు మూడు దశల్లో ఉత్సవాలు నిర్వహిస్తారు. గోల్కొండ బోనాలు అనంతరం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో లష్కర్ బోనాలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో, హరిబౌలిలోని శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో ఉత్సవాలు ముగిశాయి. 150 సంవత్సరాల క్రితం పెద్ద కలరా వ్యాప్తి తరువాత ఈ పండుగను మొదటిసారి జరుపుకున్నారని సాధారణంగా నమ్ముతారు. మహంకాళి కోపం వల్లనే ఈ మహమ్మారి వచ్చిందని ప్రజలు నమ్మి ఆమెను శాంతింపజేయడానికి బోనాలు సమర్పించడం ప్రారంభించారు. ఈ ఏడాది ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.15 కోట్లతో బోనాల ఉత్సవాలు జరుపుతున్నారు.
