విశాఖ నగరంలోని ఓ నాయకుని వద్ద ఉన్న రెండు వేల రూపాయల నోట్లను మారిస్తే పది శతం కమీషన్ వస్తుందని మరోకరు చెప్పడంతో నోట్ల మార్పిడి వ్యవహారంలో మోసానికి పాల్పడ్డట్టు విశాఖ హోం గార్డుల ఇన్ స్పెక్టర్ స్వర్ణలత ఒప్పుకున్నారు.నోట్ల మార్పిడి దందాలో ఏ4 నిందితురాలిగా రిమాండ్ లో ఉన్న ఉన్న ఆమెను విచారణ కోసం ఒకరోజు కస్టడి కి తీసుకున్నారు. క్రైమ్ డిసిపి నాగన్న సహా ఎసిపి, ముగ్గురు ఇన్ స్పెక్టర్ లు , మహిళా సిబ్బందితో ఎంవిపి కాలనీ పోలీసు స్టేషన్ లో విచారించారు.వివరాలు చెప్పడానికి మొండికేసున స్వర్నలతను పోలీసులు చివరికి తమదైన పద్ధతిలో విచారించడంతో కొన్ని వివరాలు బయటకు వచ్చాయని తెలుస్తోంది. తన వాహన డ్రైవర్ ఒత్తిడి చేయడం వల్ల డబ్బుకు ఆశ పడి ఈ పని చేసినట్టు స్వర్ణలత పోలీసులతో చెప్పారు. అంతేకాక, ఆమె వ్యక్తిగత వ్యవహారాలపై కూడా ఆరాతీసినట్టు సమాచారం.