అమ్ము కోవడం కోసం పార్టీలు పెట్టడం,పదవుల కోసం సిద్ధాంతాలు, లక్ష్యాలను తుంగలో తొక్కడం ఒకప్పటి ప్రజారాజ్యం, నేటి జనసేన పార్టీలకే సొంతం. రంగు పూసుకున్న మొహాలు చూసే ప్రేక్షకులు తమను నాయకులుగా ఎన్నుకుంటారనే అత్యాశతో రాజకీయ పార్టీలు పెట్టడం పారిపోయింది. తమిళనాడులో ఎంజీఆర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి అప్పటి పరిస్థితులే కారణం. అంతేకాదు, ఆ నాయకుల నిబద్ధత, ప్రజలకు సేవ చేయాలనే పట్టుదల కూడా వాళ్లను వెండితెర నుంచి జనంలోకి నడిపించాయి. పార్టీ సిద్ధాంతాలను వాళ్ళు ఎన్నడూ విస్మరించలేదు, మార్చలేదు. కానీ, సినిమా హాల్ లలో చప్పట్లు ఓట్లగా మార్చుకోవచ్చనే మితిమీరిన ఆశతో వెనుక, ముందు చూసుకోకుండా పార్టీ పెట్టడం నిజంగా దురదృష్టం. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం, జనసేన పార్టీల గురించి ప్రస్తావించాల్సిన సమయం ఇది.
తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీ పెట్టిన చిరంజీవి బలమైన ఎజెండా లేకుండా ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఏ ఒక్కరోజు ఈ పార్టీ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడలేదు. అంతేకాదు, అప్పటి ఎన్నికల్లో కనీసం ఆంధ్రప్రదేశ్ లోనూ సీట్లను గెలవలేక చతికిల పడింది. మొత్తం 18 సీట్లతో సర్దిపెట్టుకో అంటూ జనం జవాబు చెప్పారు. మంత్రి పదవి కోసం ప్రజారాజ్యం పార్టీని అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు. 2012 సంవత్సరం నుంచి 2014 వరకు కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రిగా పదవిలో కూర్చున్నారు. అదీ ప్రజారాజ్యం ఘనత.

ఇక అన్న దుకాణం మూసి వేయగానే ఆయన తమ్ముడు పవన్ కొత్త దుకాణం తెరిశారు. ప్రేక్షకుల నుంచి టిక్కెట్ల రూపంలో నోట్లు వసూలు చేయడమే కాక ఓట్లు గుంజుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. తనకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని క్యాష్ చేసుకోవాలని భావించాడు. ఆ కోణంలో తన సినిమా కొఠరీతో స్క్రిప్ట్ రాయించాడు. ఆవేశంతో వెళ్తేనే జనం ఆదరిస్తారనికొని ఎక్కడ నేర్చుకున్నాడో ఏకంగా పోరాట యోధుడు “చేగువేరా” బొమ్మ చూపిస్తూ 2014లో జనసేన పార్టీని జనం మధ్యకు వదిలారు. పిడికిలి బిగించి మరీ ప్రచారానికి దిగారు. కానీ, ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో పిడికిలి తెరవలేక పోయారు. అంటే, పోటీకి దూరంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 2019 లో జరిగిన ఎన్నికల్లో గంపెడు ఆశలతో 135 సీట్లలో పోటీ చేసిన జనసేన ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. అసలు విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ పోటీ చేసిన చోట ఓడిపోవడం కోస మెరుపు. దీంతో చేగువేరా అంటూ బిగించిన పిడికిలి పట్టు సడలడం మొదలు పెట్టింది. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు అరెస్టును అవకాశంగా మలచుకొని పవన్ పావులు కదపడం మొదలు పెట్టారు. చంద్రబాబుతో అంటకాగి 2024 ఎన్నికల్లో సీట్లు పొందారు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుపై ఉన్న సానుభూతి పవనాలు జనేసేన అభ్యర్ధులను కూడా ఊహించని రీతిలో అసెంబ్లీకి, పార్లమెంటుకి పంపాయి. దీన్ని బలంగా భావించిన జనసేన క్రమంగా చేగువేరాకు సమాధి కట్టింది. ఆయన స్థానంలో మోడీనీ జపం ఎత్తికొని బాబు ప్రభుత్వంలో పవన్ ఉప ముఖ్యమంత్రి హోదా దక్కి చుకున్నారు. ఆ తర్వాత బహిరంగంగా సనాతన ధర్మం అనే కొత్త నినాదాన్ని జనసేనకు తగిలించారు. దీంతో రాజకీయాల్లో ఊసరవెల్లిగా మారడం దాదాపు పూర్తీ అయింది.
తరిమి కొట్టుడే…! హా.. హా హా..!
తాజా పరిణామాలు పరిశీలిస్తే, ప్రత్యేక తెలంగాణపై మాట సాయం కూడా చేయని “కొణిదెల బ్రదర్స్” తెలంగాణ నవ నిర్మాణం కోసం అంటూ తెలంగాణ గడ్డ మీద సభలు పెట్టాలని ప్రయత్నించడం మితి మీరిన ఆలోచన. పక్క రాష్ట్రంలో పదవులు అనుభవిస్తూ, తెలంగాణలో ఆస్తులు కూడబెట్టుకొని వాటిని కాపాడుకోవడం కోసం నవనిర్మాణం ముసుగు వేయాలనుకోవడం క్షమార్హం. ఆంధ్రాలో అమరావతి నిర్మాణంలో పాల్గొనాల్సింది పోయి హైదరాబాద్ నవనిర్మాణ పై మోజు పడడం నటనలో భాగంగా పరిశీలకులు భావిస్తున్నారు. దేశాన్ని ఏలిన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు దేశం మొత్తం తిరుగుతారు కానీ నన్ను తెలంగాణకు రానివ్వరా అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన అపరిపక్వ ఆలోచనలకు అద్దం పడుతున్నాయని వాదనలు వస్తున్నాయి. పార్టీలను తాకట్టు పెట్టడం. అమ్ముకోవడం చరిత్ర ఉన్న కొణిదెల సోదరులకు కాంగ్రెస్ నేతలపై మాట్లాడే అర్హత లేదని కాంగ్రెస్ పార్టీ మంత్రులు, సీనియర్ నేతలు స్పష్టం చేస్తున్నారు. జనసేన జాతీయ పార్టీ కాదు కాబట్టి ప్రాంతీయ పార్టీ గీత దాటితే తీవ్ర పరిణామాలు ఉంటాయనే హెచ్చరికలు వస్తున్నాయి. చివరిగా, తెలంగాణలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి చంద్రబాబు ఆదేశాలతో తిరుమల తిరుపతి దేవస్థానం 30 కోట్ల విరాళం అందజేస్తే అదేదో తన సొంత డబ్బు ఇచ్చినట్టు పవన్ ప్రచారం చేసుకోవడం పట్ల తెలంగాణ ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన విరాళాన్ని మంత్రి హోదాలో పవన్ దర్శనం కోసం వచ్చి ప్రకటించారే తప్ప ఆయన చేసిందేమీ లేదని తేల్చి చెబుతున్నారు. ఇంకోసారి కొండగట్టు విరాళం గురించి మాట్లాడితే ఆ గట్టు కిందనే పాతర వేస్తామని హెచ్చరించడం గమనార్హం. వచ్చే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ అనిశ్చితికి తెర లేపే ఆలోచనలో భాగంగా జనసేన ఎత్తుగడలు వేస్తోందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
