“ట్రంప్” అవసరమా ..!

INT CRIMNL C

ప్రపంచ దేశాలు ఏకమై తెలివితక్కువ అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ పై పోరాడాల్సిన సమయం వచ్చింది. డాలర్ పేరుతో ఆధిపత్యం చెలాయిస్తూ, దాన్నే అవకాశంగా తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారి “పిచ్చి ట్రంప్” సాగిస్తున్న అంతర్జాతీయ గారడీని అన్ని దేశాలు అడ్డుకోవాల్సిన సమయం ఇది. డాలర్ ను తుంగలో తొక్కితేనే గానీ అనేక దేశాలు స్వయం సమృద్ధి సాధించడం తథ్యం. అమెరికా డాలర్ కు తల వంచితే ప్రస్తుత దుస్థితి మరింత తీవ్రం అయ్యే ప్రమాదం ఉంది. అకారణంగా ఇరాన్, ఇజ్రాయిల్ వివాదంలో గుడ్డెద్దు, పోటు మొనగాడు మాదిరిగా తల దూర్చిన ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఇప్పుడు బయటపడ లేక కొట్టుమిట్టాడుతోంది. ఇరాన్ పై సాగుతున్న యుద్ధం వల్ల సాధించేది శూన్యం అనే వాస్తవం తెలిసి కూడా పరువు కాపాడుకోవడానికి ట్రంప్ మేకపోతు గాంభీర్యం చూపించడం అమెరిజన్లకే కాదు ప్రపంచంలో ట్రంప్ సంక నాకుతున్న అనేక దేశాలు కూడా సిగ్గుపడే స్థితి.

ట్రంప్ చేస్తున్న తప్పిదం ఒక్కటే.. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా బాగోగులు చూసుకోవాల్సిన అసలు అంశాన్ని పక్కనబెట్టి, ప్రపంచ దేశాలపై పెత్తనం చెలాయించే తెలివి తక్కువ ఆలోచనలకు ఊతమివ్వడమే పెద్ద సమస్య. తనకు సంబంధం లేని అనేక విషయాల్లో ట్రంప్ జోక్యం చేసుకోవడం, జోక్యం చేసుకున్నట్టు ప్రచారం చేసుకోవడం ఆయన అతి తెలివికి సాక్ష్యం. గతంలో భారత్ -పాక్ మధ్య తలెత్తిన సమస్యను తనే పరిష్కరించానని గుడ్డిగా చెప్పుకోవడం ఒక ఉదాహరణ. ఇప్పుడు ఇరాన్ లో ఇరుక్కున్న తనను రక్షించడానికి అగ్రరాజ్యం దిక్కులేక తీవ్రవాదుల ఆశ్రయ దేశం పాకిస్తాన్ మద్దతు కోరడం ట్రంప్ దిగజారుడు తనానికి నిలువెత్తు నిదర్శన.

మొన్న తన మిత్ర దేశం పాకిస్తాన్ లో జరిగిన చర్చలు విఫలం కావడం పూర్తిగా ట్రంప్ వైఫల్యమే. ఒకవైపు చర్చలు జరుగుతుంటే మరోవైపు ఆ చర్చల్లో ఇరాన్ తమ సూచనలను అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రకటన జారీ చేయడం బెదిరించే ధోరణికి నిదర్శనం. దీంతో చర్చల సమయంలో ఇరుదేశాలు రెచ్చగొట్టే ప్రకటనలు చేయకూడదు అనే ప్రాధమిక విషయం కూడా ట్రంప్ కి తెలియదనేది తెలిసిపోయింది. ఆయన ఈ నోటి దూల ఫలితమే మొన్న చర్చలు అర్ధంతరంగా ముగియడానికి ప్రధాన కారణం. ఇంకో ప్రధాన అంశం ఏంటంటే 48 గంటల్లో ఇరాన్ నాగరికతను తుదముట్టిస్తా అంటూ ట్రంప్ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే అమెరికా సైన్యానికి సైనిక బేస్ ఇచ్చే ప్రసక్తే లేదని బ్రిటన్ ప్రకటించడం పెద్దన్న ఆశలకు గండి కొట్టింది.

సిగ్గులేని అమెరికా..!

ప్రపంచంలో దాదాపు అన్ని ప్రసార మాధ్యమాలు ట్రంప్ ను “పిచ్చి ట్రంప్” అని గౌరవంగా సంబోధిస్తున్నా ఆయనకు ఆ అర్ధం చెవిన పడకపోవడం పెద్ద సమస్య.  అమెరికాలో ఆయనకు వత్తాసు పలికే రెండు, మూడు ప్రసార సాధనాలు తప్పిస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని మీడియా సంస్థలు ఇరాన్ వ్యవహారంలో  ట్రంప్ బరితెగింపును ఎండగడుతున్నాయి.

ఇస్లామాబాద్ లో చర్చలు విఫలం ఆయన తర్వాత ఇరాన్ ఆధీనంలోని హర్ముజ్ జలసంధిపై అవగాహన లేని ప్రకటన చేయడం ట్రంప్ ఆవేశానికి మరో ఉదాహరణ. ఆ జలసంధిని దిగ్బంధం చేశాం అని అమెరికా నుంచి చెప్పడం ఆ దేశ సైన్యానికే ఇబ్బందిగా మారింది. ఆ జలసంధిపై ట్రంప్ ఆదేశాలను సాక్షాత్తు సౌదీ అరేబియా ప్రాంత ప్రభుత్వాలే తప్పు పట్టడం మరో విశేషం. అర్ధం లేని తన మొండి పట్టుదలతో ఇరాన్ పై ట్రంప్, ప్రభుత్వం సాగిస్తున్న అరాచక యుద్ధం వల్ల ప్రపంచ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు సతమతం అవుతున్నారు. సామాన్యుడు బతకడానికి అవసరమైన వస్తు, సామగ్రిపై “పిచ్చి ట్రంప్” ప్రభావం పడుతోంది.  ఈ దిక్కి మాలిన యుద్ధం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని భారత ప్రభుత్వం బయటికి ప్రకటనలు చేస్తున్నా యుద్ధం ప్రభావం పల్లెల ప్రజలను సైతం ఇబ్బంది పెడుతోందనేది బహిరంగ వాస్తవం. ప్రజలను ఆదుకోవడంలో మధ్యవర్తి దేశం పాకిస్తాన్  ఇప్పటికే చేతులు ఎత్తేసింది. పాక్షిక లాక్ డౌన్ ప్రకటించింది.

యుద్ధం పేరుతో  అగ్రరాజ్యం అమెరికా పరువు తీస్తున్న ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం పై ఆ దేశంలోనే తీవ్ర వ్యతిరేకత పెల్లుబికుతోంది. ఆయన్ని పదవి నుంచి తొలగించే దిశలో విపక్షాలు పావులు కదుపుతున్నాయి. అయితే, ఇరాన్ పై యుద్ధం వల్ల చరిత్రలో నిలిచిపోవాలనే కుటిల ఆలోచనలో ఉన్న ట్రంప్ కి విపక్షాల డిమాండ్ మింగుడు పడడం లేదు.  ఇప్పటికే ఇరాన్ పై నైతికంగా ఓటమి పాలైన అమెరికా కేవలం పరువు కాపాడుకోవడానికి మాత్రమే కుటిలయత్నాలు చేస్తోందని, “తోలు మందం” వారికి ఇది సహజమే అంటూ హిల్లరీ క్లింటన్ బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఆయన్ని పదవి నుంచి తొలగించే కోణంలో కసరత్తు చేస్తున్నారు. ఇరాన్ నాగరికతను అంతమొండిస్తా అంటూ గత వారం ట్రంప్ చేసిన ప్రకటన అత్యంత తీవ్రమైనదిగా అంతర్జాతీయ సమాజం భావిస్తోంది. శత్రుమూకలపై పోరాటం సాగించలేక సామాన్య జనాన్ని అంతమొందిస్తా అంటూ ట్రంప్ బెదిరింపులకు దిగదాన్ని సామజిక, రాజకీయ పరిశీలకులు అంతర్జాతీయ నేరంగా అభివర్ణిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *