బోరు నుంచి మంటలు..

konasima bore

కోనసీమ జిల్లాలోని ఓ ఆక్వా చెరువు వద్ద బోరులోంచి గ్యాస్‌, అగ్నికీలలు ఎగసిపడటం కలకలం రేపింది. రాజోలు మండలం శివకోటిలోని ఆక్వా చెరువు వద్ద ఈ ఘటన జరిగింది. ఉదయం నుంచి అగ్నికీలలు, గ్యాస్‌ ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. 20 అడుగుల మేర ఈ మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ రంగంలోకి దిగింది. మంటలార్పేందుకు అగ్నిమాపక, ఓఎన్జీసీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, ఈ ఘటన జరిగిన ప్రదేశంలో గ్యాస్‌ కోసం గతంలో సెస్మిక్‌ సర్వే జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఆక్వా చెరువుల్లో నీటి కోసం అదే చోట 6 ఏళ్ల కిందట బోరు వేయగా రెండు రోజుల కిందట ఈ బోరును మరింత లోతుకు తవ్వారు. దీంతో భూమిలోని గ్యాస్‌ బయటికి వచ్చి నేడు మంటలు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. పైప్‌లైన్‌ అయితే గ్యాస్‌ను నిలిపి వేసి మంటలను ఆపేవాళ్లమన్నారు. కానీ, భూమిలో నుంచి నిరంతరంగా గ్యాస్‌ వస్తుండటంతో మంటలు అదుపు చేయడం కష్టంగా మారిందని అధికారులు తెలిపారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *