ఒకరిది అభివృద్ధి .. ఇంకోకరిది పంతం…!

babu devlp c

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో అగ్రనేతల మధ్య పనితీరు గమ్మత్తుగా కనిపిస్తోంది. పరిపాలనలో దిట్టగా పేరున్న  తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం తాపత్రయ పడుతుంటే, టిడిపి సానుభూతితో సీట్లు దక్కించుకున్న జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాత్రం తన పార్టీని కాపాడుకునే పనిలో పడ్డారు. వివిధ సంస్థలతో చర్చలు జరిపి, వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడం కోసం చంద్రబాబు సింగపూర్ వెళ్తే, దేశ సమగ్రత కోసం పోరాడటం మా సైనికుల కర్తవ్యం అంటూ పవన్ దేశ రాజధాని ఢిల్లీ బాట పట్టడం గమనార్హం. చంద్రబాబు ఆ వయసులోనూ విదేశాలకు వెళ్ళి పెట్టుబడిదారులతో వ్యాపార వ్యవహారాలు మాట్లాడుతుంటే, దేశంలో సమైక్యతకు ఇప్పుడే ఏదో ముప్పు వాటిల్లినట్టు దాని ముసుగులో తాను దేశంలో ఎక్కడైనా తిరగగలను అని తెలంగాణ ప్రజలకు, ప్రభుత్వానికి చాటింపు వేసే విధంగా ఢిల్లీలో  జనసేన  రాజకీయ సమావేశం నిర్వహించడం తాజా ఉదాహరణ.

babu sing 1

పార్టీ ఆవిర్భావదినాన్ని సొంత రాష్ట్రంలో ఘనంగా నిర్వహించాల్సింది పోయి, కొంత మంది కొఠారి నాయకులతో ఢిల్లీలో సమావవేశం కావడం రాజకీయ విశ్లేషకులకు సైతం అంతుపట్టడం లేదు. ఎవరికి ఏ సందేశం ఇవ్వడానికి ఢిల్లీని వేధికాగా ఎంచుకున్నారనేది రాజకీయ వర్గాలలోనే కాదు, సామాన్య ప్రజాల్లోనూ చర్చగా మారింది. రాష్ట్ర అభివృద్ధికి ఉపముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చేదోడుగా ఉండాల్సిన పవన్ ఆ విషయాన్ని పక్కనపెట్టునట్టు కనిపిస్తోందనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. కూటమిలో ఉంటూ, కొంతకాలంగా తన పార్టీ బలోపేతం వైపే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారని పరిశీలకులు పేర్కొంటున్నారు. అందులో భాగంగానే మొన్నటి ఎన్నికల్లో తమ గెలుపునకు కారణాలను సరైన రీతిలో బేరీజు వేసుకోకండా, ఏదో సొంత బలంతో సీట్లు గెలిశామని ఊహించుకుంటూ జనసేనను జాతీయ పార్టీగా మలుస్తామని వెల్లడించడం ఆశ్చర్యంగా ఉందని  సీనియర్ రాజకీయ నేతలు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఒక రాష్ట్రంలో అధికారంలో ఉండీ, ప్రాంతీయంగా అత్యంత బలంగా ఉన్న పార్టీలే జాతీయ స్థాయిలో పోరాదడానికి సహసించలేదని వివరిస్తున్నారు. అలాంటిది పాతిక మంది ఎం. ఎల్. ఎ. లు కూడా లేని జనసేనను పవన్ జాతీయ స్థాయిలో ఎలా ఊహించుకుంటున్నారో అంతుపట్టడం లేదని, ఇలాంటి రాజకీయ దూకుడు పార్టీ  భవిష్యత్తుకు నష్టం చేకూరుస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయాల్లో ఆరితెలిన చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో ఉండడం పవన్ కి మంచి అవకాశం అని, మంచి అనుభవాన్ని పొందితే సేన భవిష్యత్ మెరుగు పడే అవకాశం ఉందని సూచిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా చంద్రబాబు పర్యటనలు చేస్తున్న సమయంలో పవన్ బయట రాష్ట్రాలలో జనసేన సమావేశాలు నిర్వహించడం వల్ల కూటమి ప్రభుత్వంలో సఖ్యత దెబ్బతినే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *