godavari bcm

పెరుగుతున్న గోదావరి…

ఉత్తరాధిన కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా  భద్రాచలం వద్ద గోదావరి నది  నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. పై నుంచి భారీగా నీరు రావడంతో    గోదావరికి వరద ఉధృతి పెరిగింది.  దీంతో  భద్రాద్రిలో గోదావరి నీటి మట్టం 18.3 అడుగులకు చేరింది. గోదావరి నదికి వరద ఉధృతి  పెరగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ సాయంత్రానికి వరద ప్రవాహం మరితం పెరిగే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నారు.

Read Full News
Screenshot 2023 07 14 084311

ఎందుకలా …

తెలంగాణలో సంచలనం రేకెత్తించిన ఎమ్మెల్యే కొనుగోలు అంశం బట్టబయలు చేయడంలో కీలక పాత్ర పోషించిన తాండూర్ ఎమ్నెల్యే రోహిత్ రెడ్డికి, కేసీర్ సర్కార్ Y కేటగిరి అదనపు భద్రతను కల్పించింది‌… అయితే, తన భద్రతా సిబ్బందితో కలిసి రోహిత్ పోటో షూట్ లో పాల్గొనడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకలా చేయాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు.

Read Full News
mohanbabu

మండిపడ్డ “మంచు”…

ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు షాద్ నగర్‌లో మీడియాపై కాసేపు మండి పడ్డారు. ఓ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఆయన స్థానిక సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చారు. అయితే, మోహన్ బాబు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న స్థానిక మీడియా ప్రతినిధులు కొందరు కవరేజ్‌కు వెళ్లారు. మీడియాను చూడగానే మోహన్ బాబు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. “ఆ లోగోలు లాక్కొండయ్యా” అంటూ బౌన్సర్లకు సూచించారు. మీడియా ప్రతినిధులకు బుద్ధి లేదా అంటూ నోటికి పని చెప్పారు. సీనియర్ నటుడైన…

Read Full News
revanth c

పాస్ పోర్ట్ బ్రోకర్ కెసిఆర్…

గత రెండు రోజులుగా పుట్టలో పడుకున్న పాములు బయటకు వచ్చి నన్ను నిందించే ప్రయత్నం చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అమెరికాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కాంగ్రెస్ విధానాల గురించి వివరించి వారి సందేహాలను నివృత్తి చేసామని తెలిపారు. 24గంటల విద్యుత్ సరఫరా విషయంపై సాంకేతికంగా వివరించే ప్రయత్నం చేసామని,  కేటీఆర్, బీఆరెస్  మా వీడియోను ఎడిట్ చేసి ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించారు. బీఆరెస్ చిల్లర రాజకీయ ప్రయత్నంతో…

Read Full News
drone c

రైతులకు క్రిషి 2.0 …

దేశంలో ప్రముఖ డ్రోన్ తయారీ, టెక్నాలజీ ప్రొవైడర్   డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మానవ రహిత వైమానిక వాహనం (యు ఏ వి )   క్రిషి 2.0  ను ఆవిష్కరించింది.  క్రిషి 2.0 డ్రోన్ 10 కిలోల పేలోడ్ సామర్థ్యంతో రూపొందించారు.  ఈ డ్రోన్  రోజుకు 30 ఎకరాల్లో  క్రిమిసంహారక, పురుగు మందులను  పిచికారీ చేస్తుంది.   నెలలో   750 నుండి 900 ఎకరాల్లో  రైతులు  తమ పంటలను కాపాడుకునేలా అవసరమైన మందులను పిచికారీ చేసే  అవకాశం ఉంది….

Read Full News
harisha c

ముమ్మరం చేయండి…

రాష్ట్రంలోని భోదనసుపత్రుల్లో 190 అసిస్టంట్ ప్రొఫెసర్ పోస్టులకు  అసోసియేట్ ప్రొఫెసర్ గా పదోన్నతులు కల్పించే ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలని, కౌన్సిలింగ్ పూర్తి చేసి వెంటనే పోస్టింగ్ లు ఇవ్వాలని రాష్ట్ర  ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రొఫెసర్ నుండి అడిషనల్ డిఎంఇగా పదోన్నతి పొందేందుకు వీలుగా వయోపరిమితి 57 ఏళ్ల నుండి 64 ఏళ్లకు…

Read Full News
racha in1

కరెంటు రచ్చ..

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఉచిత కరెంటు పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అంటూ అధికార టిఆర్ఎస్ మండి పడుతోంది. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా  రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు మేపట్టింది, నాయకులూ, మంత్రుల అధ్వర్యంలో అన్ని జిల్లాలలో నిరసనలో భాగంగా రాస్తారోకోలు, దిస్తిబోమ్మలను దగ్దం చేశారు.ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లో ఇతర నాయకులు జిల్లాల్లో నిరసన చేపట్టారు.మహబూబ్ నగర్ లోని తెలంగాణ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో  రాష్ట్ర…

Read Full News
cm sc c

పుస్తకం భేష్…

ఎస్టీ జాతుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సృజనాత్మక పథకం‘చీఫ్ మినిస్టర్స్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీం (సీఎంఎస్ఇఇఐ) ద్వారా వివిధ రంగాలలో లబ్ధిదారులైన ఎస్టీ యువతీ యువకుల విజయగాథలను, సాధించిన ప్రగతికి సంబంధించిన సమాచారాన్ని దశాబ్ధి ఉత్సవాల నేపథ్యంలో  రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ పుస్తక రూపంలో ప్రచురించింది. ఈ పుస్తకాన్ని సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  ఆవిష్కరించారు. ఈ  కార్యక్రమంలో  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి…

Read Full News
himachal 12

క్షేమంగా రావాలి…

హైదరాబాద్ నగరానికి చెందిన ముగ్గురు డాక్టర్లు హిమాచల్ ప్రదేశ్ మనాలి లోని వరద ముంపు ప్రాంతంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఉస్మానియా ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ బానోత్ కమల్ లాల్, డాక్టర్ రోహిత్ సూరి, డాక్టర్ శ్రీనివాస్ వరదల్లో చిక్కుక్కున్నారు. ముగ్గురు డాక్టర్ల ఫోన్స్ స్విచ్చాఫ్ అయినట్లు సమాచారం. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.డాక్టర్ల ఆచూకీ కోసం తెలంగాణ డాక్టర్ల సంఘం ఢిల్లీ రెసిడెంట్ కార్యాలయాన్ని సంప్రదించింది.

Read Full News
harish nirmala

ఆ నిధులు ఇవ్వండి…

తెలంగాణలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం నిధులు మంజూరు చేయాలని  ఆర్థిక శాఖ మంత్రి హారీష్ రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు దిల్లీలో జరిగిన  50వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశం సమావేశానంతరం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి తో సమావేశమై వినతి పత్రాన్ని అందజేశారు.

Read Full News

కరెంటు మంట…

తెలంగాణలో రైతులకు 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు అని  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అమెరికా పర్యటనలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో 95 మంది 3 ఎకరాల లోపు చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని, వారికి మొత్తంగా రోజుకి 8 గంటలు ఉచిత విద్యుత్తు ఇస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. విద్యుత్తు సంస్థలతో కమీషన్ లకు కక్కుర్తిపడి కేసీఆర్ అనవసరంగా 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారని ఆరోపించారు. రేవంత్ వ్యాఖ్యలపై…

Read Full News
kavita c

కంకి రుచి..

జగిత్యాల జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత తిరుగు ప్రయాణంలో మల్యాల మండలం నూకపల్లి వద్ద రోడ్డు పక్కన మొక్కజొన్న కంకులు కాలుస్తున్న ఓ మహిళా దగ్గరికెళ్లి కంకులు కొనుగోలు చేసి అక్కడే రుచి చూశారు. రుచిని ఆస్వాధిస్తూ ఆమె వివరాలు సేకరించారు. కంకులు విక్రయించే మహిళ తన పేరు కొమురమ్మ అని తెలంగాణ వచ్చిన తర్వాత కెసిఆర్ పాలన గురించి వివరించింది. ఇంటింటికి పించన్ తదితర రూపాల్లో కేసీఆర్ మంచిగిస్తుండని కొమురమ్మ పేర్కొంది. స్వయంగా కేసీఆర్ కూతురే…

Read Full News
cs delhi c

చాలా అవసరం…

రాష్ట్రంలోని పలు అభివృద్ధి పథకాలకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరుతూ న్యూ ఢిల్లీలోని పలువురు కేంద్ర కార్యదర్శులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలసి విజ్ఞప్తి చేశారు. ఒక రోజు పర్యటన కోసం ఢిల్లీ వెళ్లిన సి.ఎస్, కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ , కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ కార్యదర్శి లీలా నందన్, కేంద్ర రహదారులు, రవాణా, జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి…

Read Full News