
ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ చేరుకున్నారు. మమునూర్ ఎయిర్ పోర్ట్ లో ప్రధానికి కలెక్టర్లు స్నిక్టా పట్నాయక్, ప్రావీణ్య, మాజీ ఎంపీ బూర నర్సయ్య స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రధాని నేరుగా శ్రీ భద్రకాళి దేవాలయనికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.
