జనం దృష్టిలో అదో పేరున్న బహుళజాతి మాల్. హంగూ ఆర్భాటంతో నగరాల నడిబొడ్డున హంగామా చేయడం, వినియోగదారులను ఆకర్షించేందుకు ఎత్తులు వేయడంలో దిట్ట. ప్రారంభంలోనే లాభాలు దండుకోవాలనేది ప్రధాన లక్ష్యం. అందుకే దుకాణం తెరిచే నాటికి ఇబ్బడి ముబ్బడిగా లేనిది ఉన్నట్టు చూపిస్తూ ప్రసార సాధనాలు, హోర్డింగుల ద్వారా ప్రకటనలు గుప్పిస్తారు. కానీ, ఆ మాల్ లో విక్రయించేది మాత్రం పై మెరుగులు దిద్దిన ఉత్పత్తులు మాత్రమే అనేది అమాయక వినియోగదారులకు తెలియని వాస్తవం. కొనుగోలు చేసిన వస్తువులు మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోతాయి. ఆ అనుభవం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ నిజం తెలుస్తుంది. ఈ దృశ్యాలన్నీ కనిపించేది జనం బారులు తీరి ఎగబడుతున్న “ఐకియా” ఫర్నిచర్ స్టోర్ లో అంటే అతిశయోక్తి గా ఉంటుందేమో, కానీ ఇదే వంద శాతం నిజం అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. అందులో ప్రజలకు ప్రతీ ఇంట్లో అవసరమైన మంచాలు (బెడ్స్) పెద్ద ఉదాహరణ.
ఐకియలో అరుదైన, ఆకర్షణీయమైన వస్తు సామాగ్రి దొరుకుతుంది అనడంలో సందేహం లేదు. ఆ ఒక్క ప్రచారంతోనే స్వీడన్ కి చెందిన ఐకీయా సుమారు 63కి పైగా దేశాల్లో దాదాపు 490 స్టోర్ లతో వ్యాపారాన్ని విస్తరించింది. 12 వేలకు పైగా ఉత్పత్తులను సేకరించి విక్రయాలకు పెడుతోంది. మన దేశంలో మొదటి స్టోర్ ని హైదారాబాద్ మహానగరంలో 2018 ఆగష్టు నెలలో ప్రారంభించింది. లక్షల చదరపు అడుగుల్లో అనేక రకాల హంగులతో వినియోగదారులను అశేషంగా ఆకట్టుకుంటున్న ఈ ఫర్నిచర్ స్టార్ పై కొంత కాలంగా ఆరోపణలు వస్తున్నాయి. అరుదైన సామాగ్రి పేరుతో, అద్భుతమైన ఇంజనీరింగ్ మెలకువలతో అంతగడుతున్న సామాగ్రిలో ఎంత మాత్రం నాణ్యత ఉండడంలేదనేది బలమైన వాదన. ఆ స్టోర్ లో లభిస్తున్న మంచాలు (కాట్స్) వినియోగదర్లను తీవ్ర అసంతృప్తి గురి చేస్తున్నాయి. చెక్క (ఉడ్) కాకపోయినా దానికి మించి నాణ్యమైన మెటీరియల్ తో రూపొందించిన మంచాలు అంటూ ఐకియా చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధమని తేలిపోతోంది. అక్కడ అమ్మకానికి పెడుతున్న మంచాలు ప్రత్యేకమైన మెటీరియల్ తో తయారైనవని, చెక్క కంటే మన్నిక ఎక్కువ కాలం ఉంటాయని చెబుతున్న మాటలు కేవలం వినియోగదారులను తప్పుదోవ పట్టించడానికి మాత్రమే.
ఐకియా మంచాలు చెక్క కాకపోయినా కనీసం చెక్క పొట్టు , కార్డు బోర్డు, ప్లే ఉడ్ లాంటి మెటీరియల్ లలో ఉన్నంత నాణ్యత కుడా లేకపోవడం గమనార్హం. చెరకు పిప్పి వంటి అతి బలహీనమైన మెటీరియల్ కు, డెకోలమ్ లాంటి షీట్ లకు మధ్య అట్ట పెట్టెలు పేపర్ ని అతికించి మంచాలు తయారు చేయడం ఐకియా ఘనత అద్దం పడుతోంది. “తేలికైన మెటీరియల్” అంటూ అక్కడి సిబ్బంది తెలివిగా మాయమాటలు చెప్పడం సమస్యగా మారింది. చెక్క రూపంలో కనిపిస్తున్న ఐకియా మంచాలు పూర్తిగా “డొల్ల” అని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు. అందుకు ఈ కథనంలో కనిపిస్తున్న చిత్రాలే ప్రత్యేక సాక్ష్యం. ఒక వియోగదారుడు కొనుగోలు చేసిన మంచం డొల్ల తనం నెల రోజులకే బట్టబయలు అయింది. మంచం కింది భాగంలో ఒక వైపు సుమారు పది ఇంచుల మేర విరిగిపోవడంతో అందులోని పూర్తీ డొల్ల రూపం వెలుగు చూసింది. అసలు మంచానికి లోపల వాడిన మెటీరియల్ ఏమిటనేది పరిశీలిస్తే అది పేపర్ గా తేలింది. అట్ట పెట్టెలకు వాడే పేపర్ ని రిబ్బన్ మాదిరిగా రూపొందించి రెండు డెకొలమ్ షీట్ ల మధ్య అతికించడం మోసపూరిత ఇంజనీరింగ్ నైపున్యతకు నిదర్శనం.. అందుకే ఆ మంచాలు అతి తక్కువ బరువుతో తేలికగా ఉంటాయనేది స్పష్టమైంది. అయితే, ఇలాంటి సమస్య అనేక మందికి ఎదురైనా బ్రాండ్ ని చూసి అనేక మంది ప్రశ్నించలేక పోతున్నారు. ఎక్కడో తయారై వస్తున్న ఐకియా ఉత్పత్తుల నాణ్యత పై సంబంధిత అధికారులు విచారణ జరపాలనే డిమాండ్ వస్తోంది. నాణ్యత లోపం వల్ల వేలాది రూపాయలు నష్ట పోవలసి వస్తోందని వాపోతున్నారు.
Danyavaadaalu Srimaan. Inta pedda Moosaanni Public cheesinanduku.
Ee vidhamaina Doopudi cheyadaanikeneemo “Hangu -Aarbaataalu”.
Public jara Jaagarta.