సికింద్రాబాద్, హౌరా ఫలక్ నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. ఈ సంఘటన భువనగిరి జిల్లాలోని బొమ్మాయిపల్లి- పగిడిపల్లి మార్గంలో చోటు చేసుకుంది. ముందుగా రైలు నుండి పొగ రావడంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ప్రయాణికులను అప్రమత్తం చేశారు. దీంతో ప్రయాణికులను వెంటనే రైలు నుండి దింపేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రైలును బొమ్మాయిపల్లి వద్ద నిలిపివేశారు. రైల్వే అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపీరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఘటన స్థలానికి చేరుకొని [పరిస్థితిని సమీక్షించారు.