కరెంటు మంట…

తెలంగాణలో రైతులకు 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు అని  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అమెరికా పర్యటనలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో 95 మంది 3 ఎకరాల లోపు చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని, వారికి మొత్తంగా రోజుకి 8 గంటలు ఉచిత విద్యుత్తు ఇస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. విద్యుత్తు సంస్థలతో కమీషన్ లకు కక్కుర్తిపడి కేసీఆర్ అనవసరంగా 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారని ఆరోపించారు. రేవంత్ వ్యాఖ్యలపై అధికార టిఆర్ఎస్ పార్టీ మంత్రులు , నాయకులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అని ఇరుచుకుమడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *