కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఉచిత కరెంటు పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అంటూ అధికార టిఆర్ఎస్ మండి పడుతోంది. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు మేపట్టింది, నాయకులూ, మంత్రుల అధ్వర్యంలో అన్ని జిల్లాలలో నిరసనలో భాగంగా రాస్తారోకోలు, దిస్తిబోమ్మలను దగ్దం చేశారు.ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లో ఇతర నాయకులు జిల్లాల్లో నిరసన చేపట్టారు.మహబూబ్ నగర్ లోని తెలంగాణ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. రైతుల జోలికొస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్గౌడ్ ,డిసిసిబి ఇన్చార్జి చైర్మన్ వెంకటయ్య, ముడా చైర్మన్ గంజి వెంకన్న ముదిరాజ్, మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింహులు, జిల్లా రైతు బంధు సమన్వయ కమిటీ చైర్మన్ గోపాల్ యాదవ్ , జిల్లా గొర్రె కాపరుల సహకార సంఘం అధ్యక్షులు శాంతన్న యాదవ్ పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలో కరెంట్ కార్యాలయం ముందు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రోడ్ పై బైటాయించి ధర్నా నిర్వహించారు.