నమస్తే.. నా పేరు లీసా..

Screenshot 2023 07 13 091710

ఛానల్స్ లో ఇక మరింత సాంకేతిక మార్పు రావచ్చు. ప్రత్యేకంగా అందమైన యాంకర్ల కోసం వెతకడం, వాళ్ళను ఇంటర్వ్యూలు చేసి, వడపోసి ఎంపిక చేయడం లాంటి ప్రక్రియలకు భవిష్యత్తులో తెర పడవచ్చు. తడబాట్లు , బిడియం వంటి తలనొప్పులకు తావులేకుండా బుట్ట బొమ్మల్లాంటి యాంకర్లతో కార్యక్రమాలు చేయించ వచ్చు. ఎలాంటి యాంకర్లు, న్యూస్ రీడర్లు కావాలో ఉహించుకొని అలాంటి వాళ్ళను తెరపై చూపవచ్చు. అందుబాటులోకి వస్తున్నా సాంకేతిక పరిజ్ఞానం ఈ వెసులుబాటును కల్పించనుంది. అదే ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ (ఎ.ఐ) ప్రభావం. ఇప్పటికే వివిధ రంగాల్లో దూసుకుపోతున్న ఈ పరిజ్ఞానం ఇప్పుడిప్పుడే మీడియాలో చేరనుంది. కొన్నిఛానళ్ళ యాజమాన్యాలు ఎ.ఐ విధానంలో వర్చువల్ న్యూస్ యాంకర్ ను సృష్టించి వారితో వార్తలు చదివించే ప్రయత్నాలను ప్రారంభించారు. ఒడిషా లో ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ వాళ్లు వర్చువల్ న్యూస్ యాంకర్ ను ఆవిష్కరించడం అందుకు తాజా ఉదాహరణగా చెప్పవచ్చు. భారతీయత ఉట్టిపడేలా అందంగా, అపురూపంగా, సాంప్రదాయ చేనేత చీర ధరించి “లీసా” పేరుతో మలచబడిన ఈ ఎ.ఐ. బొమ్మ చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *