కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న కేరళ మాజీ ముఖ్యమంత్రి , సీనియర్ కాంగ్రెస్ నేత ఊమెన్ చాందీ కన్నుమూశారు. ఈ విషయాన్ని కేరళ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు కె. సుధాకరన్ వెల్లడించారు. 79 ఏళ్ల ఊమెన్ చాందీ బెంగళూరులోని చిన్మయ మిషన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారు. చాందీ కేరళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. రెండు సార్లు ముఖ్యమంత్రి గా, 4 సార్లు మంత్రిగా, 12 సార్లు ఎమ్మెల్యేగా దాదాపు ఐదున్నర దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో వివిధ హోదాలలో చాందీ పని చేశారు. ఆయన మరణం కేరళకు తీరని లోటని, ఒక గొప్ప నాయకుడిని కోల్పోయామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నట్టు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.