రానున్న లోక్ సభ ఎన్నికల్లో బిజెపిని గద్దె దించడమే ప్రధాన ఎజెండాగా విపక్షాల సమావేశాలు జరిగాయి. అధికారం కోసం బిజెపి ఎంతకైనా తెగిస్తుందని దాన్ని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని అన్ని పార్టీలు నిర్ణయించాయి. ప్రధాని పదవిపై కాంగ్రెస్ పార్టికి మోజులేదని మల్లిఖార్జున కార్గే వెల్లడించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున కార్గే, ముఖ్యమంత్రులు మమత బెనర్జీ, నితీష్ కుమార్,స్టాలిన్, అరవింద్ కేజ్రివాల్,భగవంత మాన్, హేమంత్ సోరెన్,మాజీ ముఖ్య మంత్రులు లాలూ ప్రసాద్, అఖిలేష్ యాదవ్, మహాబుబా, ముఫ్తీ , ఉద్దావ్ థాకరే, సీతారాం ఏచూరి, డి.రాజా,వైగో, ఫరుఖ్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. విపక్షాల కూటమికి కొత్త పేరును ఇండియాగా నిర్ణయించారు. I అంటే ఇండియా, N అంటే నేషనల్,Dఅంటే డెమోక్రాటిక్, I అంటే ఇంక్లుసివ్, A అంటే అలయన్స్ గా వ్యవహరిస్తారు.