రాష్ట్రంలో ఎర్ర చందనం, ఇతర అటవీ ఉత్పత్తుల స్మగ్లింగ్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎప్పుడో దశాబ్దాల క్రితం నమోదైన కేసుల్లో ఇప్పటి వరకు చార్జిషీట్ దాఖలు చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అటవీ సంపద అక్రమాలపై సమగ్ర దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటుచేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. సివిల్ కోర్టుకు ఉండే అన్ని అధికారాలు సిట్‍కు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను వారం రోజుల్లో కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ కార్యదర్శికి పంపాలని రాష్ట్ర అటవీ శాఖను దేశించింది. 2014 నాటి కేసుకు సంబంధించి 2023లో కేసు నమోదు చేయడంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అంతేగాక , ఇలాంటి వ్యవహారాలను సుమోటాగా స్వీకరించాలని రిజిస్ట్రీ కి సూచించింది. తదుపరి విచారణను వచ్చే సెప్టెంబరు 6వ తేదీకి వాయిదా వేసింది