తెలంగాణ వర్సిటీ ఉపకులపతి(వీసీ) దాచేపల్లి రవీందర్ అవినీతి నిరోధక శాఖ (అనిశా) వలలో చిక్కారు. తార్నాకలోని తన నివాసంలో రూ.50వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. భీంగల్‌లో పరీక్షా కేంద్రం ఏర్పాటు కోసం ఆర్మూర్ లోని శ్రీ షిర్డిసాయి ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు దాసరి శంకర్ అనే వ్యక్తి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.అరెస్టు చేసి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తలించారు.