కేజీబీవీ లో ఉద్యోగాలు ..ఇలా చేయండి…

కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు( కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్(యూఆర్ఎస్)లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేజీబీవీ, యూఆర్ఎస్ లలో 1,241 ఉద్యోగాలు కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు. 854 పీజీసీఆర్, 273 సీఆర్డీ, 77 పీఈటీ, 12 ఎసీ పోస్టుల భర్తీకి శనివారం నోటిఫికేషన్ వెలువడనుంది. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో పోస్టులకు మహిళలు మాత్రమే అర్హులు. ఈనెల 26 నుంచి జులై 7 వరకు ఆన్లైన్ లో ధరఖాస్తులు స్వీకరిస్తారు. https:// schooledu.telangana.gov.inలో వివరాలు తెలుసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. కాంట్రాక్టు ఉద్యోగాలకు రాత పరీక్ష ద్వారా అర్హులను ఎంపిక చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *