ఓకే వ్యక్తిని అందలం ఎక్కించాలన్నా, అధ:పాతాళానికి తోక్కిపట్టాలన్నా నరం లేని నాలుక చేటు చేస్తుంది. ఎంత తెలివి ఉన్న ఖర్మ సరిగా లేనప్పుడు నాలుక నాలుగు మడతలు తిరుగుతుంది. వ్యక్తి మనుగడకు ప్రధాన వరారు మాటలు పలికించే నాలుక. దాన్ని అదుపులో పెట్టుకొని అవసారానికి తగ్గట్టు వాడుకుంటే ఆ కిక్కే వేరు. అందుకే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రతగా మాట్లాడాలని, మాట అదుపు తప్పితే ఏం జరుగుతుందో గతంలో చాలా సార్లు చాలా మంది నిరూపించారు. ఆ జబ్బితాలో ఇటీవల ముగ్గురు చేరారు. ఆంధ్రప్రదేశ్ లో మొన్నటి వరకు అధికారంలో ఉన్న జగన్ కి మద్దతుగా పోసాని కృష్ణ మురళి, అలీ, యాంకర్ శ్యామల ఈ ముగ్గురు. ఎన్నికల సమయంలో పరిధి దాటి చేసిన ప్రసంగాలు వారి పై ఉన్న విశ్వసనియతను దెబ్బ తీశాయి. ఇప్పుడు ఈ ముగ్గురు తమ ఇళ్ళకి తాళాలు వేసుకొని బతుకుతున్నారు. విచిత్రం ఏంటంటే వాళ్ళు ఇంటి లోపలే ఉండి. బయట తాళాలు వేసుకుంటున్నారని, కనీసం పాల వాళ్ళు వచ్చి పిలిచినా తలుపు తియ్యటం లేదని, అలీ అయితే ఏటో వెళ్లిపోయాడనే వార్తలు వస్తున్నాయని ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు నట్టి కుమార్ వెల్లడించడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ లో మొన్నటికి దాకా అధికారంలో ఉన్న వైసీపీ కి వకాల్తా పుచ్చుకొని టిడిపి,జనసేన అధినేతలైన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ని నానా దుర్భాషలు ఆడారు. ఇప్పుడు టీడీపీ, జనసేన అధికారంలోకి రావడంతో భయంతో తాళాల ఆట ఆడుకుంటూ కర్మ అనుభవిస్తున్నారని నట్టి కుమార్ అన్నారు.
అలా జరిగింది…
