రాష్ట్ర క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖ అధ్వర్యంలో ఈ నెల 22న అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సంస్మరణ ర్యాలీ జరపనున్నారు. “అమరవీరుల సంస్మరణ ర్యాలీ” ని 6 వేల మంది సాంస్కృతిక శాఖ కు చెందిన కళాకారులతో వివిధ కళారూపాల తో అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ శాఖ అధికారులు ముమ్మార ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ లో B R అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం నుండి లుంబిని పార్క్ సమీపంలోని అమర జ్యోతి వేదిక వరకు ర్యాలీ కొనసాగుతుంది. ఈ ర్యాలీ లో తెలంగాణ కు చెందిన డప్పుల కళాకారులు, ఒగ్గుడోలు, బోనాలు, కోలాటం, గుస్సాడి, కొమ్ముకొయ, లంబాడీ, రాజన్న డోలు, కోలాటం, చిందు యక్షగానం, బోనాలు, పోతురాజుల విన్యాసాలు, బతుకమ్మలు, షేరి బాజా, మర్ఫా లతో పాటు పేరిణి, కూచిపూడి, భరత నాట్యం, కథక్ వంటి శాస్త్రీయ నృత్య కళాకారులు శకటాల పై తమ కళా ప్రదర్శన లు నిర్వహిస్తున్నామన్నారు. వివిధ శాఖల కు చెందిన ఛైర్మన్ లు రసమయి బాలకిషన్, జూలూరి గౌరీశంకర్, దీపికా రెడ్డి, మంత్రి శ్రీదేవి, సంస్కృతిక, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియ, సంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, MD టూరిజం మనోహర్, పురావస్తు శాఖ అధికారులు నారాయణ, నాగరాజు లతో కలసి మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ నిర్వహణ ఏర్పాట్లును పరిశీలించారు. ఈ ర్యాలీ లో తెలంగాణ కళా వైభవాన్ని, తెలంగాణ రాష్ట్రం సాదించిన అభివృద్ధి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా దశ దిశల చాటాలని అధికారులను ఆదేశించారు.