తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తే తాను కూడా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి ప్రస్తావించాల్సి వస్తుందని ఎమ్మెల్యే ద్వారంపూడి హెచ్చరించారు. వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ గోదావరి జిల్లాలో బస్సు యాత్ర చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడ్డారు. పవన్ కళ్యాణ్ వై.సి.పి నాయకుల పై విమర్శలు, ఆరోపణలు చేస్తే సాహిన్చేదే లేదన్నారు. ఆయన ఇలాగే ప్రవర్తిస్తే హీరోయిన్లతో ఉన్న రిలేషన్స్ గురించి మాట్లాడాల్సి వస్తుందంటూ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేరని.. పవనే సినిమా తీసుకుని అందులో ఎమ్మెల్యే, సీఎం గా ఉహించుకోవచ్చని ఎద్దేవా చేశారు. పవన్ రాజకీయ వ్యభిచారి అనీ, ప్యాకేజీ స్టార్ అని ప్రజలందరికి ఆరోపించారు. ఎవరి కోసం పవన్ జనసేన పార్టీని పెట్టరానేది అందరికి తెలుసన్నారు. జనసేన తరపున కాకినాడలో తనపై పోటీ చేసి గెలవాలని సవాలు చేశారు. పక్కవారిని విమర్శించే ముందు ఒకటికి, రెండు సార్లు పరిశీలించు కోవాలన్నారు.