విశ్వ విజేత..
పొట్టి ప్రపంచకప్ మనకే దక్కింది. 17 ఏళ్లుగా పోరాటంతో పొట్టికప్పును భారత్ రెండో సారి సగర్వంగా అందుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో భారత్ 7 పరుగుల తేడాతో అద్వితీయమైన విజయం సాధించి విశ్వవిజేతగా అవతరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా.. కోహ్లీ (76: 59 బంతుల్లో 6×4, 2×6), అక్షర్ పటేల్ (47; 31 బంతుల్లో 1×4, 4×6) చెలరేగిన వేళ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య…