ఎన్నుకోలేదు..దిగిపోండి..!
హైదరాబాద్ లోని జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల కేటాయింపులో జరుగుతున్న జాప్యం వల్ల జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సభ్యులు మళ్లీ పోరుబాట పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాక, ప్రస్తుతం సొసైటీకి బాధ్యత వహిస్తున్న మేనేజింగ్ కమిటీ పై కూడా మెజారిటీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఎన్నికలు లేకుండా కొనసాగుతున్న కమిటీలోని వారు వెంటనే తప్పుకోవాలనే బలమైన డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికె కొందరు రాజీనామా చేసినట్టు సమాచారం అందుతున్నప్పటికీ మేనేజింగ్ కమిటీ మొత్తం…