తెలంగాణలో శాసనసభ ఎన్నికల నిర్వహణను అధ్యయనం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన అధికారుల బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, అరుణ్ గోయల్, అనూప్ చంద్రపాండేతో పాటు మరికొంత మంది సభ్యులు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోగా రాష్ట్ర అధికారులు స్వాగతం పలికారు. కాసేపట్లో ఈ బృందం రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. మూడు రోజుల పాటు ఈ బృందం రాష్ట్రంలో పర్యటించి, అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
షెడ్యూల్ కోసం…
