తెలంగాణాలో “మైక్రోలింక్”
అమెరికా టెలికమ్మూనికేషన్స్ దిగ్గజం మైక్రోలింక్ నెట్ వర్క్స్ రూ.500 కోట్ల పెట్టుబడితో తెలంగాణాలో తమ ఎలక్ట్రానిక్, ఇతర ఉత్పత్తుల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. హైదరాబాద్ కు చెందిన పిఎస్ ఆర్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో మైక్రోలింక్ పరిశ్రల క్లస్టర్ ను ప్రారంభిస్తుందని తెలిపారు. గురువారం నాడు మైక్రోలింక్ గ్లోబల్ ప్రతినిధులు, భారతీయ భాగస్వామి ‘పిఎస్ ఆర్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ శ్రీరంగారావు మంత్రితో సచివాలయంలో సమావేశమయ్యారు….