గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరో…!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు, ఆసక్తికర కొత్త కొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి. మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీతో అంటకాగిన జనసేన చంద్రబాబు జైలులో ఉండగానే తెలుగుదేశంతో పొత్తు ఖరార చేసుకుంది. ఇదే సందర్భంలో బిజెపితోనూ సఖ్యతగా మెలుగుతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడం రాజకీయ పరిశీలకులను ఆలోచనల్లో పడేసింది. దీంతో తెలుగుదేశం, జనసేన కలసి ఎన్నికల బరిలోకి దిగితే…
