హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం లో భాగంగా మూసీ నదిపైన ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణాన్ని చేపడతామని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ ఔటర్‌రింగ్ రోడ్డుపై నార్సింగి వద్ద 29.50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఇంటర్ ఛేంజ్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ మురుగు నీటిని పునర్వినియోగించే పాలసీని తీసుకురానున్నట్టు, సెప్టెంబర్ నాటికి హైదరాబాద్‌లో మురుగునీరు శుద్ధీకరణ పూర్తవుతుందని తెలిపారు. ఔటర్ చుట్టూ పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా సర్వీస్ రోడ్లను విస్తరించాలనే సీఎం కేసీఆర్ సలహా మేరకు అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఓఆర్‌ఆర్‌పై వాహనాల స్పీడును 100 కిలో మీటర్ల నుంచి 120కి.మీ. వరకు పెంచినట్టు, మూసీ నదిపై 14 బ్రిడ్జ్‌ల నిర్మాణానికి అనుమతులిచ్చినట్టు వివరించారు. అదేవిధంగా శంషాబాద్ నుంచి మూసీ వరకు ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించనున్నట్టు మంత్రి వెల్లడించారు. మతి కొన్ని రోజుల్లో కోకాపేట్, మల్లంపేట్‌లో ఇంటర్‌ఛేంజ్‌లు అందుబాటులోకి వస్తాయన్నారు.
