అప్పుడు ఆర్టికల్ గుర్తుకు రాలేదా..!

artical C
pawan glass

గతంలో ఇదే పవన్ కల్యాణ్ రాజకీయ నేతలను “పంచలు ఊడదీస్తాం” అంటూ ఆవేశపూరిత వ్యాఖ్య చేసినప్పుడు ఆర్టికల్ 19 గుర్తుకు రాలేదా అనే వాదనలు తెరపైకి వస్తున్నాయి.అప్పట్లో ఈ అనాలోచిత మాటలు నాయకుల మనోభావాలను దెబ్బతీసి, వివాదమైన సంగతి తెలియదా. అంతేకాదు, చిరంజీవి కూతురు ప్రేమ వ్యవహారంపై వార్త ప్రచురించిన సికింద్రాబాద్ లోని ఒక దినపత్రిక యాజమాన్యం అంతం చూస్తా అంటూ జనం మధ్య నడిరోడ్డుపై తుపాకీ పట్టుకొని పవన్ చేసిన హంగామా గుర్తు చేసుకుంటున్నారు. శ్రీజా కొణిదెల  మొదటి భర్త శిరీష్ కి ప్రాణహాని ఉందంటూ సాక్షాత్తు శ్రీజ ఆందోళన వ్యక్తం చేస్తే తన రివాల్వర్ ను నేరుగా పోలీసు స్టేషన్ లో అందజేయాల్సింది పోయి దాన్ని సినిమా ఫక్కీలో మీడియా ముందు ప్రదర్శించినప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ, శాంతి భద్రతల చట్టాలు ఎక్కడికి వదిలేశారు అనే వాదనలు మొదలయ్యాయి.  సినిమా వేషాలను రోడ్లపై చూపించమని ఏ రాజ్యాంగ చెప్పిందో పవన్ కి తెలియదా అనే ఘాటైన విమర్శలు వస్తున్నాయి.

pawn

సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, నకిలీ ఖాతాలపై చర్యలు తీసుకుంటామని, ఐటీ చట్టం, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) వంటి చట్టాల కింద కఠిన చర్యలు తీసుకుంటామని  పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని సామాజిక పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఆయన ఫోటో పెట్టి ఇతరులను కించపరుస్తున్న ఖాతాలు పవన్ కి కనిపించడం లేదా అంటున్నారు. పవన్ పోస్ట్ చూస్తుంటే ఆర్టికల్ 19ను వివరించే ప్రయత్నం చేస్తూ మీడియాను హెచ్చరిస్తున్నట్టు, భయపెడుతున్నట్టు ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *