మహా ప్రమాదం….
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటి శ్రుతిశెట్టి, డి.జి.పి. అంజని కుమార్, నగర పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ తదితరులు.
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటి శ్రుతిశెట్టి, డి.జి.పి. అంజని కుమార్, నగర పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ తదితరులు.
ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద రూ.25 కోట్ల వ్యయంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) నిర్మించిన ఉప్పల్ స్కై వాక్ ప్రాజెక్టును పురపాలక శాఖ మంత్రి కె.టి.అర్. లాంచనంగా ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బాటసారి భద్రతకు ఉప్పల్ స్కైవాక్ ఎంతో దోహదపడుతుందన్నారు. తొలుత మినీ శిల్పారామం వద్ద రూ.10 కోట్ల హెచ్ఎండిఏ నిధులతో నిర్మించిన మల్టీ పర్పస్ హాల్ మంత్రి ప్రారంభించారు. ఆ తర్వాత ఉప్పల్ చౌరస్తాలో స్కైవాక్ శిలాఫలకాన్ని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా డైరెక్టర్ రాం గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న “వ్యూహం” సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు.
రైళ్ళు, బస్సుల్లో కిటికీల నుంచి వర్షపు నీళ్ళు లోనికి రావడం మామూలే.. కానీ పురి గుడిసెకు కన్నంపడినట్టు రైలు పైకప్పు నుంచి వర్షం ధారలు పడితే కొంచెం ఇబ్బందే. అలంటి రైలే అవంతిక ఎక్స్ ప్రెస్ . ముంబాయి నుంచి ఇండోర్ వెళ్ళే ఈ ఎక్స్ ప్రెస్ థర్డ్ ఎసి బోగీలో పైనుంచి వర్షపు నీళ్ళు కురవడతో ప్రయాణికులు తంటాలు పడ్డారు.
గౌడ అత్మ గౌరవ భవనానికి హైదరాబాద్ లోని కోకాపేటలో భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమం లో రాష్ట్ర మంత్రులు డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే లు ప్రకాష్ గౌడ్, వివేకానంద్ కలిసి పాల్గొన్నారు. గీత కార్మికులకు 12 కోట్ల 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా అందజేశారు. బి.సి. సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వేంకటేశం, ఎక్సైజ్ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, మాజీ శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్, మాజీ…
అమరావతిలోని వి.ఐ.టి. యూనివర్సిటీలో అసలు ఏం జరుగుతోందో బయటి ప్రపంచానికి తెలియడంలేదు. క్యాంపస్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే బలమైన ఆరోపణలు వస్తున్నా పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. విద్యార్ధుల సమస్యలు పట్టించుకోకుండా అటు యునివర్సిటీ యాజమాన్యం, మరోవైపు పోలీసులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి క్యాంపస్ లో తాజాగా జరిగిన గొడవలే ఉదాహరణగా కనిపిస్తున్నాయి. పోలీసులకుగానీ, ప్రసార సాధనాలకు గానీ సమాచారం చేరవేయలుకునే వారిని యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతున్నట్టు కొందరు విద్యర్ధుల ద్వారానే తెలుస్తోంది….
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో బైడేన్ ప్రత్యేకమైన టి.షర్టు ని బహుకరించారు. ఎర్రని రంగు షర్టు పై భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ , అమెరికా, ఇండియా అని రాసి ఉంది. వేదిక పై మైక్రోసాఫ్ట్ సి.ఇ.ఒ. సత్య నాదెళ్ళ ఉన్నారు.
అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ దేశ ప్రముఖ గాయని మేరీ మిల్బెన్ జన గణ మన గీతాన్ని ఆలపించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ పాదాలను తాకి ఆశీర్వాదం కోరారు. భారత సంప్రదాయాన్ని అనుసరించినదుకు మిల్బెన్ ని పలువురు కొనియాడారు.
ఏజెన్సీ ప్రాంతాలలో నివాసం ఉంటున్న బీసీ వర్గాలలోని సంచార, అర్థ సంచార, విముక్త కులాలు, జాతుల ప్రజలను ప్రత్యేకంగా గుర్తించి వారి జీవన ప్రమాణాల మెరుగు పరిచేందుకు ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని సినీ నటుడు సుమన్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం రాష్ట్ర బీసీ కమిషన్ ను కోరింది. కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, సభ్యులు, సి.హెచ్.ఉపేంద్ర, కె. కిశోర్ గౌడ్ లతో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలను కమిషన్ దృష్టికి తెచ్చారు….
మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు వేడుకలలో భాగంగా హైదరాబాదులో నిర్వహించిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక , సాంస్కృతిక మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ గౌడ్ ముఖ్య అతిథిలు గా పాల్గొన్నారు. ఈ కార్యమానికి మాజీ పార్లమెంట్ సభ్యులు, సినిమా నటులు మురళీమోహన్, తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల క్షత్రియ సేవా సమితి సభ్యులు,…
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ సిస్టమ్ (ఎల్ ఎ డి సి ఎస్ ) కార్యాలయాలు ప్రారంభం అయ్యాయి. వీటిని హైకోర్టు లో చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమా నికి పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు హాజరయ్యారు.
సంగారెడ్డి జిల్లా హన్నుర్ మండలం వడ్డేపల్లి గ్రామస్తులు సనత్ నగర్ లోని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. వడ్డేపల్లిలోని సురభి కెమికల్ ఫ్యాక్టరీని వెంటనే మూసివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ నుంచి వెలువడే దుర్గంధం వల్ల పిల్లలు, పెద్దలు రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశ్గారు. అంటే కాక భూగర్భ జలాలు సైతం కలుషితం అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ కెమికల్ ఫ్యాక్టరీని వెంటనే తొలగించాలని నియంత్రణ…
రెండు రోజుల పర్యటనకు ధిల్లి వెళ్ళిన రాష్ట్ర పురపాలక, ఐ.టి. శాఖల మంత్రి కేటీఆర్ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. స్థానికుల సౌకర్యార్ధం సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని సాధారణ ప్రజలు నివసించే ప్రాంతాలను హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ లో కలిపేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ కేటీఆర్ రాజ్ నాథ్ సింగ్ కి లేఖ అందజేశారు. అదే విధంగా, మెహదిపట్నం రైతు బజారు వద్ద చేపట్టే స్కై వాక్ నిర్మాణానికి కావలసిన…
తిరుమల నడక మార్గం ఏడోవ మైలు వద్ద చిన్నారి పై చిరుత దాడి చేసింది. ఐదు సంవత్సరాల బాలుడిని పైకి ఒక్కసారిగా విరుసుకుపడిన చిరుత అందరు చూస్తుండగానే ఎత్తుకుపోయింది. అక్కడే విధులో ఉన్న పోలిసులు కేకలు వేయడంతో చిరుత బాలుడిని వదిలేసి వెళ్ళింది. గాయ్యాల పాలైన బాలుడిని ఆసుపత్రికి తరలించారు. బాలుడిని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం చేర్పించారు. టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వై.వి.సుబ్బారెడ్డి, పలువురు టి.టి.డి అధికారులు పరామర్శించారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని…
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, అయన సతీమణి వైఎస్ భారతి.