అక్కడ అసలేం జరుగుతోంది….

అమరావతిలోని వి.ఐ.టి. యూనివర్సిటీలో అసలు ఏం జరుగుతోందో బయటి ప్రపంచానికి తెలియడంలేదు. క్యాంపస్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే బలమైన ఆరోపణలు వస్తున్నా పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. విద్యార్ధుల సమస్యలు పట్టించుకోకుండా అటు యునివర్సిటీ యాజమాన్యం, మరోవైపు పోలీసులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి క్యాంపస్ లో తాజాగా జరిగిన గొడవలే ఉదాహరణగా కనిపిస్తున్నాయి. పోలీసులకుగానీ, ప్రసార సాధనాలకు గానీ  సమాచారం చేరవేయలుకునే వారిని యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతున్నట్టు కొందరు విద్యర్ధుల ద్వారానే తెలుస్తోంది. క్యాంపస్ లో జరుగుతున్నా విషయాలను తెలుసుకోవడానికి వెళ్ళిన పేరెంట్స్ పై దాడులకు పాల్పడడం అక్కడి పరిస్థితులకు నిలువెత్తు నిదర్శనం.  ప్రతీ రోజు ఇలా ఎదో ఒక గొడవ జరుగుతున్నా యాజమాన్యం నిమ్మకునిరెత్తినట్టు వ్యవహరించడం సమస్యను మరింత జటిలం చేస్తోంది.  మొన్న జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేయడానికి తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన విద్యార్ధిని బెదిరించి కంప్లైంట్ చేయకుండా వెనక్కి రప్పించినట్టు తెలుస్తోంది. ఇదే వ్యవహారం  బయటకు పొక్కకుండా  యూనివర్సిటీ వర్గాలు నానా తంటాలు పడ్డాయి. క్యాంపస్ లో గంజాయి వంటి మత్తు పదార్ధాల దందా కుడా జరుగుతోందనే ఘాటైన విమర్శలు వస్తున్నాయి. ఆ మత్తులోనే గొడవలు జరుగుతున్నాట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా సంబధిత అధికారులు యూనివర్సిటిపై దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి చర్యలు తిసుకోవాలని విద్యార్ధుల తల్లి దండ్రులు, విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *