వసూళ్ళ పంట…

దేశంలో వస్తు, సేవల పన్ను వసూళ్లు భారీగా నమోదయ్యాయి.  జూన్‌ నెలకు  1,61,497 కోట్ల రూపాయలు  వసూలై నట్టు  కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సీజీఎస్టీ రూపంలో రూ.31,013 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద రూ.38,292 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.80,292 కోట్లు చొప్పున వసూలైనట్లు  వివరించారు.  గత ఏడాది జూన్‌లో రూ.1.44 లక్షల కోట్లు వసూళ్లు కాగా, ఈ ఏడాది 12 శాతం మేర పెరిగాయి.  అదేవిధంగా  జీఎస్టీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లు మార్కు దాటడం ఇది నాలుగో సారి అని ఆర్ధిక శాఖ తెలిపింది. 2021-22లో తొలి త్రైమాసికంలో జీఎస్టీ సగటు వసూళ్లు రూ.1.10 లక్షల కోట్లు ఉండగా, 2022-23 తొలి త్రైమాసికానికి రూ.1.51 లక్షల కోట్లకు, 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.1.69 లక్షల కోట్లకు పెరిగినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణలో రూ.4,681.39 కోట్ల మేర వసూళ్లు జరిగాయి. గతేడాది రూ.3,901.45 కోట్లతో పోలిస్తే 20 శాతం మేర పెరిగాయి. ఇక  ఆంధ్ర ప్రదేశ్ లో  గత ఏడాది   రూ.2,986.52 కోట్లు వసూళ్లు నమోదు కాగా, ఈ ఏడాది జూన్‌లో రూ.3,477.42 కోట్లు వసూళ్లు జరిగాయి. ఎప్పటిలానే మహారాష్ట్ర రూ.26,098.78 కోట్ల (17 శాతం) వసూళ్లతో అగ్రస్థానంలో నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *