తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రిమోట్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతిలో ఉందని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్ అంటే బిజెపి బంధు పార్టీ అని ఎద్దేవా చేశారు. సిఎల్పి నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ పాల్గొన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ కనుసన్నలలోనే ఇక్కడి బిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేతోందని దుయ్యబట్టారు. పార్లమెంటులో మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతాంగ వ్యతిరేక బిల్లుకు బిఆర్ఎస్ పద్ధతు పలకడమే చిన్న ఉదాహరణగా రాహుల్ చెప్పారు. మోడీ ప్రతీ నిర్ణయానికి తెలంగాణ ముఖ్యమంత్రి వత్తాసు పలుకుతున్నరన్నారు. మద్యం కుంభకోణం వ్యహారం అన్ని ప్రభుత్వ విచారణ సంస్థలకు తెలుసన్నారు. ఈ మధ్య జరిగిన విపక్షాల భేటిలో బిఆర్ఎస్ కి కూడా స్థానం కల్పిస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయపడ్డారని, బిఆర్ఎస్ అంటే “బిజెపి రిస్తేదర్ సమితి “ అని చెప్పినట్టు, అందుకే ఆ భేటిలో బిఆర్ఎస్ కి అవకాశం ఇవ్వలేదని వివరించారు. తెలంగాణ ప్రజల స్వప్నాన్ని కెసిఆర్, ఆయన కుటుంబం 9 ఏళ్లుగా నిరుగార్చిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరధ, ధరణి భూముల పేరుతో లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. అంటే కాకా ఆదివాసీలు, దళితులూ, అణగారిన వర్గాలను సైతం కెసిఆర్ ప్రభుత్వం దోచుకుంటోందన్నారు. పోడు భూములు కచ్చితంగా ఆదివసిలకే చెందుతాయని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వారి భూములు వారికే చెందేల చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వృద్దులకు 4 వేల రూపాయల పిచన్ అందజేయనున్నట్టు రాహుల్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పరుగు రాష్ట్రమైన కర్ణాటకలో వచ్చిన ఫలితాలే తెలంగాణాలోనూ కనిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణాలో అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే యువత నడుంబిగించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్, బిఆర్ఎస్ ల మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందన్నారు. బహిరంగ సభలో రాహుల్ గాంధీ కండువా కప్పి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ప్రజగాయకులు గద్దర్ తదితరులు పాల్గొన్నారు.