సంగారెడ్డి జిల్లా ఐడిఎ బొల్లారం లో ఓ పాస్టర్ బండారం బయట పడింది. పరాయి మహిళలతో వ్యవహారం నడుపుతున్న పాస్టర్ జయరాజ్ ను అయన భార్య రెడ్ హ్యాండ్ గా పట్టుకుంది. ప్రతి రోజు చర్చిలో, క్రిస్టియన్ సోదరుల ఇంట్లో ప్రార్ధనలు చేసే ఈ పాస్టర్ వంకర చూపులు చూడడం పై ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయం పై నిఘా పెట్టిన ఆయన భార్య అక్రమ సంబంధాన్ని బట్టబయలు చేసింది. బురఖా ధరించి మారు వేశంలో వెళ్లి రెడ్ హ్యాండ్ గా భర్తను మరో మహిళ తో కలిసి ఉన్నపుడు అక్కడే పట్టుకుంది.