ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల అమర్‌నాథ్ యాత్ర వరుసగా రెండో రోజు కూడా నిలిచిపోయింది. వర్షాల కారణంగా జమ్ము- శ్రీనగర్ హైవేపై కొండచరియలు విరిగిపడటంతో యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. బల్తాల్, పహల్గాం రెండు మార్గాల్లోనూ యాత్రను నిలిపివేశారు. ఎడతెరపి లేకుడా కురుస్తున్న వర్షాల వల్ల బల్తాల్, నున్వాన్ బేస్ క్యాంపుల్లోనే వేలమంది యాత్రికులు ఉండిపోయారు.పంచతర్ణి ప్రాంతంలో 1,500 మంది యాత్రికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అందులో 200 మంది వరకూ తెలుగు యాత్రికులు ఉన్నట్లు సమాచారం. ఆగస్టు 31తో యాత్ర ముగియనుంది. ఇప్పటివరకు అమర్‌నాథ్ మహా శివలింగాన్ని లక్ష మంది భక్తులు దర్శించుకున్నట్టు సమాచారం.