దేశ వ్యాప్తంగా టమాటో ల ధరలు చుక్కలను అంటడంతో వాటికీ విఐపి భద్రతా కల్పించాల్సిన పరిస్థితి ఎర్పడింది. కొన్ని ప్రాంతాల్లో టమాటో రైతుల పై దాడులు జరగడం, మరోవైపు కొందరు టమాటోలను దొంగిలించడం వంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకొని అధికారులు టమాటోలకు భద్రతకల్పిస్తున్నారు. మరికొన్ని చోట్ల వ్యాపారులే బౌన్సర్ లను నియమించుకుంటున్నారు. ఆసియాలోనీ రెండో అతిపెద్ద టమాటో మార్కెట్ కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ లో ఉంది. ఇక్కడకు పెద్ద ఎత్తున టమాటాలు రావడంతో ముందు జాగ్రత్తగా ప్రభుత్వం భద్రత ఏర్పాటు చేసింది. ఈ మార్కెట్ లో ప్రస్తుతం పోలీస్ భద్రత మధ్య విక్రయాలను కొనసాగిస్తున్నారు. కోలార్ మార్కెట్ లో 14 కిలోల టమోటా బాక్స్ ధర రూ. 2200 నుంచి 2500 మేర పలుకుతోంది. ఈ మార్కెట్ నుంచి బంగ్లాదేశ్ , పాకిస్తాన్‌తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు టమాటోలు ఎగుమతి అవుతుంటాయి. ఈ మార్కెట్ లో పోలిసుల భద్రతా కల్పించడమే కాక, అడుగడుగున సీసీ కెమెరాలు, ఏర్పాటు చేసి అమ్మకాలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.