మొన్న రాత్రి జరిపిన ఆపరేషన్ సిందూర్‌లో 100 మంది పాక్ ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేసారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతుందని వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడికి “ఆపరేషన్ సిందూర్” పేరిట గట్టిగా బదులిచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు ఆ ఆపరేషన్ గురించి వివరించేందుకు గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంట్ లోని ల్రైబరీ భవనంలో జరిగిన అఖిలపక్ష భేటీకి పలువురునేతలు హాజరయ్యారు. ఆపరేషన్ సిందూర్ పై రక్షణ మంత్రి రాజ్నాథ్ రాజకీయ పార్టీలకు వివరించారు.అయితే, పహల్గాం ఉగ్రదాడి తర్వాత అఖిలపక్ష భేటీ జరగడం ఇది రెండోసారి. కేంద్రం తరఫున మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ఎస్.జైశంకర్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. విపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సందీప్ బందోపాద్యాయ్, టీఆర్ బాలు తదితరులు పాల్గొన్నారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఆయనే ప్రధాని మోదీసందేశాన్ని వినిపించారు.
“సిందూర్” ఆగదు…
