పిల్లిని చూస్తేనే భయపడతారు కొందరు…అదే చిరుత అంటే ఆమడ దూరం పరుగెడతారు. అలాంటిది ఓ యువకుడు ఏకంగా చిరుత పులిపై విరుసుకు పడ్డాడు. దాన్ని కొట్టి పట్టుకుపోయి అధికారులకు అప్పజెప్పాడు. నిజమే.. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం హాసన్ జిల్లా పరిధిలోని అరసీకెరె తాలూకా గండాసి హోబ్లీ బాగివాలు అనే గ్రామంలో జరిగింది. వేణుగోపాల్ అలియాస్ ముత్తు అనే యువకుడు పొలానికి వెళ్తుండగా చిరుతపులి దాడి చేసింది. ఆ యువకుడు ధైర్యం చేసి దానిపై ఎదురు దాడి చేసాడు. చిరుతతో పోరాడాడు. పులి భయపడి తప్పించుకొని పారిపోతున్నా దాన్ని బైక్‌తో వెంబడించి మరీ పట్టుకున్నాడు. తన దెబ్బలకు స్పృహ కోల్పోయిన చిరుతను నాలుగు కాళ్లను తాడుతో బంధించాడు. బెక్ వెనకాల వేసుకొని వెళ్లి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. అటవీశాఖ సిబ్బంది చిరుతకు చికిత్స చేయించారు. వేణుగోపాల్ ధైర్య సాహసాలను అందరూ మెచ్చుకుంటున్నారు.