ఆటలూ ముఖ్యం..

table

విద్యార్థులు క్రీడలలో పాల్గొనడం వల్ల శారీరకంగా , మానసికంగా దృఢత్వం పొందగలుగుతారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు. అబిడ్స్ లోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో టేబుల్ టెన్నిస్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సమాజాభివృద్ధిలో విద్య కీలకపాత్ర పోషిస్తుందని, విద్యకు ప్రాధాన్యత ఇచ్చే సమాజం అభివృద్ధి చెందుతూనే ఉందని తెలిపారు . లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌ ప్లాటినం జూబ్లీ వేడుకల సందర్భంగా పాఠశాల యాజమాన్యం టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ నిర్వహించడం అభినందనీయం అన్నారు . అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లోని ప్రజలు ఉన్నత విద్యావంతులన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల ఆరోగ్యం, మనస్సు చురుకుగా ఉంటాయి. తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ ప్రభుత్వం విద్య, క్రీడలకు ప్రాధాన్యతనిచ్చిందని, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు విద్యాశాఖకు ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వ పాఠశాలలకు అత్యాధునిక వసతులు కల్పించి విద్యాశాఖను పూర్తి స్థాయిలో తీర్చిదిద్దారని మంత్రి తెలిపారు. కొత్త రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశామని, వీటిలో వందలాది మంది విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందుతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం మన ఊరు -మన బడి, మన బస్తీ – మన బడి కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టిందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, సమగ్రాభివృద్ధికి ప్రాదాన్యత ఇచ్చామని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు విజయవంతమవుతున్నాయని, అందుకే దేశంలోని ఇతర రాష్ట్రాలు తెలంగాణ పథకాలను అనుసరిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *