రాష్ట్రంలో దివ్యాంగుల పింఛన్ ను పెంచుతూ ఉత్వర్వులు జారీ చేసిన సందర్భంగా మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని కలిసి ధన్యవాదాలు తెలిపారు.దివ్యాంగులకు ప్రస్తుతం ప్రతి నెల ఇస్తున్న 3016 రూపాయల పెన్షన్ ను మరో వెయ్యి రూపాయలు పెంచడం పట్ల మంత్రి కొప్పుల హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల నుంచి ప్రతీ దివ్యంగులకు రూ.4016 రూపాయలు చెల్లించడం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు, పెన్షన్లు ఏ రాష్ట్రంలో కూడా ఇంత అద్భుతంగా అమలు కావడం లేదన్నారు. దివ్యాంగులు అందరితో సమానంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ప్రభుత్వం పెన్షన్ పెంచడంతో రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ కె. వాసుదేవ రెడ్డి సమక్ఇషంలో వికలాంగులు టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
