నైపుణ్యం కోసం మార్పులు…

iith c

విద్యార్ధుల్లో  నైపుణ్యాన్ని వెలికి తీయడానికి విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకువస్తున్నాట్టు ఐ.ఐ.టి. హైదరాబాద్ సంచాలకులు ప్రొఫెసర్ బి.ఎఎస్. మూర్తి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జాతీయ విద్యా విధానం మూడేళ్ళ లో గణనీయమైన మార్పు తెచ్చిందని పేర్కొన్నారు. ఈ నెల 29 వ తేదిన జరగనున్న జాతీయ విద్యా విధానం మూడో వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర మనవ వనరుల అభివృద్ధి శాఖ దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐ.ఐ.టి.ల ఉప కులపతులతో  నిర్వహించిన కార్యక్రమంలో పిఐబి అదనపు డిజి శ్రుతి పాటిల్ తో కలిసి మూర్తి పాల్గొన్నారు. జాతీయ విద్యా విధానం ద్వారా కొత్త కోర్సుల నిర్వహణ, భోధన వల్ల విద్యార్థులకు ఉద్యోగాలలో విస్తృత అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ఐ.ఐ.టి. హైదరాబాద్ లో విదేశీ విధ్యర్తులకు ఫెలోషిప్ కార్యక్రమాలు చేపట్టామన్నరు. విద్యార్ధులకు క్రెడిట్ రేటింగ్ విధానాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. 1.50 లక్షల చదరపు అడుతుల్లో టెక్నాలజీ ఇంక్యుబేటర్ పార్కును ఏర్పాటు చేసినట్టు మూర్తి వివరించారు.  కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి వైస్ ఉప కులపతి ప్రొఫెసర్ జగదీశ్వర్ రావు మాట్లాడుతూ హెచ్.సి.యు.లో వివిధ రకాల ఇంటిగ్రేటెడ్ మాస్టర్ కోర్సులని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.అంతేకాక, తెలంగాణాలో ప్రాంతీయ భాషలో  సాధారణ విద్యతో పాటు వృత్తి విద్యను అనుసంధానం చేసినట్టు వివరించారు. దేశ నిర్మాణ, జెండర్ స్టడీస్ , విలువ ఆధారిత విద్య కోర్సులను ప్రవేశపెట్టామన్నారు.

iiit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *