రాష్ట్రంలో స్మశాన వాటికలను అభివృద్ధి చేస్తామని చెబుతున్న ప్రభుత్వానికి ఆ పనులు ఆచరణలో జరగడం లేదు అనడానికి ఈ సంఘటనే నిలువెత్తు సాక్ష్యం. ఒకవైపు కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ఊరిలో స్మశానం లేక చనిపోయిన అంతిమ సంస్కారాలకు నానా తంటాలు పడ్డారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందిన వృద్దుడి దాహాన సంస్కారాలు చేయాలంటే వాగుదటి పోవలసిన దుస్థితి. శవాన్ని తప్పని సరి స్మశానానికి తీసుకు వెళ్ళాల్సిందే. దీంతో బంధువులు, కొందరు గ్రామస్తులు ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని పాడె మోస్తూ నిండు నీటితో ఉప్పెంగే వాగును దాటి దహన సంస్కారం చేశారు.