మేమూ రెడీ..

kcr 4
owisi single

లోక్ సభలో కేంద్ర ప్రభుత్వంపై భారత రాష్ట్ర సమితి, ఎం.ఐ.ఎం. పార్టీలు కూడా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సభ విశ్వాసాన్ని కోల్పోయిందని, ఆ మేరకు బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వర రావు నోటీసులు ఇచ్చారు. ఆ అవిశ్వాస తీర్మానాన్ని బిజినెస్ లిస్టులో చేర్చాలని కోరారు. లోక్‌సభలో రూల్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్‌లోని 17వ అధ్యాయంలోని రూల్ 198 (బి) కింద, ఈ క్రింది తీర్మానాన్ని సభలోకి తీసుకురావాలని బీఆర్ఎస్ నోటీసు ఇచ్చింది. ఇవాళ సవరించిన బిజినెస్ లిస్ట్ లో తీర్మానాన్ని చేర్చవలసిందిగా ఆ పార్టీ కోరింది. దీనికి ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ మద్దతు ఇచ్చింది. ఈ మేరకు బీఆర్ఎస్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం ప్రతిపై ఏఐఎంఐఎం అధినేత, లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ సంతకం చేశారు. ఇప్పటికే 26 ప్రతిపక్ష పార్టీల కూటమి మోడీ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్దం చేసిన సంగతి తెలిసిందే. వీటితో సంబంధం లేకుండా బిఆర్ఎస్ , ఎం.ఐ.ఎం. లు తీర్మానానికి నిర్ణయించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *