ఇంట్లోకి వచ్చిన పామును పట్టుకోవాలని చేసిన ఫిర్యాదుకు అధికారులు స్పందించ లేదు. ఎంతసేపు వేచి చూసినా వారి జాడ కనిపించలేదు. అలాంటప్పుడు ఎవరైనా ఏం చేస్తారు నలుగురి సహాయం తీసుకోని పాముని పట్టుకోవడమో, చంపడమో చేస్తారు. కానీ, మహా నగరంలో మాత్రం అలా జరగలేదు. మున్సిపాలిటి అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఆ పాముని పట్టుకొని నేరుగా ఆఫీసుకు కెళ్ళాడు ఓ యువకుడు. హైదరాబాద్ అల్వాల్ లో ఈ సంఘటన జరిగింది. ఆ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి పాము రావడంతో వాళ్లు ఆందోళన చెందారు. భారీ వర్షాలకు వరద, మురుగు నీరు ఇళ్లలోకి రావడంతో పాము కూడా వచ్చి ఇంట్లో చేరింది. ఆ పాముని పటుకోవల్సిందిగా యువకుడు జిఎహ్ఎంసి అధికారులకు ఫిర్యాదు చేశాడు. సుమారు 6 గంటలు గడిచినా జిఎహ్ఎంసి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో అసహనానికి గురైన సంపత్ కుమార్ అనే యువకుడు అల్వాల్ మున్సిపల్ వార్డు ఆఫీసుకు పామును తీసుకొచ్చాడు. దాని ఏకంగా అధికారి టేబుల్ పై పెట్టి పాము వచ్చిందటే పట్టించుకోరా అంటూ నిరసన తెలిపాడు. పాముని చూసి బెంబేలెత్తిన సిబ్భండి సర్ది చెప్పడంతో సమస్య తీరింది.